108 సిబ్బంది ఉత్తమ సేవలందించాలి
హన్మకొండ అర్బన్: అత్యవసర సేవలందించే ఉద్యోగులు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు పాటిస్తూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. 108 ఉద్యోగుల శిక్షణను కలెక్టరేట్‌లోని టీజీఓస్ భవనంలో కొనసాతుగుతుండగా శనివారం డీఎంహెచ్‌ఓ అప్పయ్య పాల్గొని సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జీవీకే ఈఎంఆర్‌ఐ ఈఎంఎల్సీ నిర్వాహకుడు ప్రమోద్ 108 ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఈఎంటీ క్రాంతికుమార్, సుధామల్ల సుధా బెస్ట్ కేసు విషయంలో స్టార్ అవార్డును డాక్టర్ అల్లం అప్పయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి నసీరుద్దీన్, పాటి శివకుమార్, మేనేజర్ మహేశ్‌గౌడ్, శిక్షకులు ప్రమోద్‌కుమార్, హనుమకొండ జిల్లా మేనేజర్లు మండ శ్రీనివాస్, గుర్రపు భరత్ కుమార్, రాజ్‌కుమార్, రాజునాయక్, పైలెట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు హాజరయ్యారు.
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో
క్యాన్సర్‌ను అరికట్టవచ్చు
ఎంజీఎం: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వాక్సిన్ ఇవ్వడం ద్వారా వారిని గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై శిక్షణ నిర్వహించారు. డీఐఓ మహేందర్, శిక్షణాధికారి భార్గవ్ హెచ్‌పీవీ సంబంధిత కేన్సర్లపై వ్యాక్సిన్ ఇచ్చే రక్షణ చర్యలను వివరించారు. ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, రుబీనా, భార్గవ్, వైద్యాధికారులు అశోక్‌రెడ్డి, శిరీష, ప్రవీణ్, సునీల్, జయంతి, విప్లవ్, జ్యోతి, మురళి పాల్గొన్నారు.
ఉద్యోగులకు పునశ్చరణ తరగతులు
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య


