నేడే రెండో విడత పోలింగ్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఐదు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, తదుపరి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. రెండో విడతలో ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పోలింగ్ జరగనుంది. శనివారం ఆయా మండలకేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ 5 మండలాల్లో మొత్తం 1,28,315 మంది ఓట ర్లు ఉన్నారు.
అధికారుల నియామకం..
5 మండలాల్లో జీపీలు 73, వార్డులు 694 ఉన్నాయి. ఇందులో 5 ఏకగ్రీవమయ్యాయి. ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ప్రస్తుతం 677 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానానికి 248 మంది, వార్డుస్థానాలకు 1,442 మంది పోటీలో ఉన్నారు. 120 వార్డులు ఏకగ్రీవం కాగా 574 చోట్ల పోలింగ్ జరగనుంది.
హసన్‌పర్తిలో సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్ స్నేహ శబరీశ్


