వరంగల్ జిల్లాలో..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో రెండో విడతలో దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 1,008 పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులు శనివారం సాయంత్రం తీసుకెళ్లారు. దుగ్గొండి మండలంలో 282, గీసుకొండ మండలంలో 188, నల్లబెల్లి మండలంలో 252, సంగెం మండలంలో 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,39,100 మంది ఓట్లు ఉండగా, 85 శాతంపైనే పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సత్యశారద ఆదివారం గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోటాపోటీ..
జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 117 ఉండగా, ఒక పంచాయతీకి నామినేషన్లు దాఖలు కాలేదు. ఐదు ఏకగ్రీవంకాగా, 111 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో 354 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వార్డులు 1,008 ఉండగా, 978 ఏకగ్రీవమయ్యాయి. 906 వార్డులకుగాను 2,203మంది పోటీ పడుతున్నారు.
సంగెం : ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిబ్బంది


