ఐలోని మల్లన్నకు వర్ణలేపనం
ఐనవోలు: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఐనవోలు మల్లికార్జునస్వామివారి మూల విరాట్, అమ్మవార్లకు సుధావళి వర్ణలేపనం (రంగులు అద్దడం) చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 10 నుంచి 15 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు. గర్భాలయం మూసి ఉంచి అంతరాలయంలో రంగులు అద్దనున్నారు. భక్తులకు స్వామివారి ఉత్సవమూర్తుల దర్శనం మాత్రం అర్ధ మండపంలో ఉంటుంది. ఈ నెల 16న ఉదయం 4 గంటలకు నిర్వహించే దృష్టికుంభం కార్యక్రమంతో స్వామి, అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్, ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దర్శనాల నిమిత్తం ఆలయానికి వచ్చే భక్తులు గమనించి సహకరించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు
ఆలయం మూసివేత
16న దృష్టికుంభంతో
దర్శనాల పునరుద్ధరణ


