350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
కాజీపేట : కాజీపేట చౌరస్తాలో మంగళవారం 360 ద్విచక్ర వాహనాల ప్రత్యేక సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. భీకర శబ్దంతో నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టుబడిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు వెంకన్న, సుజాత, సీతారాంరెడ్డి, ఎస్సైలు సంపత్, కనకచంద్రం, తదితరులు పాల్గొన్నారు.


