పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో నిర్వహించిన మాక్‌పోలింగ్ ఆకట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌వద్ద విద్యార్థులు క్రమశిక్షణగా క్యూలో నిల్చోవడం, వారితో ఓటు వేయించడం.. ఓటేశాక బ్యాలెట్ మడతబెట్టి బాక్సులో ఎలా వేయాలో.. ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. –వాజేడు
నీ ఓటు నాకే..
సాధారణంగా ఎన్నికల్లో తాము గెలవడానికి అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తుంటారు. జనగామ జిల్లా చౌడారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కర్ల పద్మ భార్గవరాంరెడ్డి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ముక్క ఉమ మంగళవారం ప్రచారంలో ఎదురుపడ్డారు. ఒకరికి ఒకరు ఓటు వేయాలని చేతులు కలుపుతూ అభ్యర్థించడం చూసిన కార్యకర్తలు, గ్రామస్తులు ముసిముసిగా నవ్వుకున్నారు. – జనగామ రూరల్
చికెన్ రెడీ ..
మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. కొందరు అభ్యర్థులు ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మానుకోట జిల్లా కేంద్రంలో ఓ చికెన్ సెంటర్‌లో మాంసం ప్యాకింగ్ చేయిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
–‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మహబూబాబాద్
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..


