భద్రకాళి ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
● భక్తులకు నకిలీ టికెట్లు
విక్రయించినందుకు చర్యలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో నకిలీ పూజా, సేవా టికెట్ల జారీ వెనుక ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని విచారణలో తేలింది. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ వరంగల్ దేవాదాయశా ఖ అసిస్టెంట్ కమిషనర్, దేవాలయ ఈఓ రాముల సునీత నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉద యం 11 గంటలకు ఆలయ కార్యాలయంలో ఈఓ అధ్యక్షతన అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. దేవస్థానం బుకింగ్ కౌంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్.నరేందర్, పి.శరత్ కుమార్ నకిలీ టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో వారిపై సస్పెన్షన్ వే టు వేశారు. ఈ ఘటనపై రాష్ట్ర దేవా దాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ పూజా, సేవా టికెట్ల విషయంలో అవకతవకలు జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవా రం ప్రకటించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని చెప్పు ల స్టాండ్ వద్ద, వాహన పూజలు జరిగే స్థలంలో భక్తుల వద్ద డ బ్బులు వసూలు చేయరాదని, ఎవరైనా డిమాండ్ చేస్తే ఈ ఓ కు ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


