రెండు వాడల మధ్య పోటీ!
హసన్‌పర్తి: మండలంలోని గంటూరుపల్లి గ్రామపంచాయతీలో అవతలి వాడ, ఇవతలి వాడల మధ్య పోటీ ఉంది. ఆయా వాడల్లో ఓట్లు మాత్రం పార్టీలకతీతంగా వేయడం ఆనవాయితీగా వస్తోంది. గంటూరుపల్లిలో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఇవతలి వాడలో 398 ఓట్లు, అవతలి వాడలో 304 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ చల్లా రాకేశ్‌రెడ్డి, అవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ సుంకరి రమాదేవి, కందుల ప్రశాంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. రాకేశ్‌రెడ్డి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. సుంకరి రమాదేవి, కుమారస్వామి అధికార పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రశాంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు.కాగా, గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఈవతలి వాడ, అవతలి వాడల నుంచి ఒక్కొక్కరే పోటీలో ఉండే వారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరి చొప్పున బరిలో నిలిచారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.


