శాంతితోనే అభివృద్ధి సాధ్యం
హన్మకొండ: శాంతితోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతి దిశగా ఆలోచించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్బాల్‌అలీ, కేయూ పాలక మండలి సభ్యుడు సురేశ్‌లాల్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, గంటా రామిరెడ్డి మాట్లాడారు. మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్రాంత ఆచార్యులు గూడ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కొక్కండ విజయ్‌బాబు, విప్పనపల్లి రవికుమార్, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, డాక్టర్ వెలుదండి రవికుమార్, పగడాల సరళ, సాగంటి మంజుల, శ్రీపాద సుధాకర్ రావు, నల్ల లక్ష్మీనారా యణ, బీటవరం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి
‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తకావిష్కరణ


