బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
వీఓఏకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో..
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన పెంతల సువర్ణ వీఓఏ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులు, మహిళలంతా కలిసి ‘సువర్ణ నీవు సర్పంచ్‌గా బరిలో నిలిచి గ్రామాభివృద్ధికి పాటుపడాలి’ అని కోరుకున్నారని, అందుకే సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీఓఏగా ఉంటూ మహిళలకు సేవలందించానని, సర్పంచ్‌గా గెలిపి మరిన్ని సేవలందిస్తానని సువర్ణ తెలిపారు.
నాడు భర్త.. నేడు భార్య
● గతంలో నీలికుర్తి సర్పంచ్‌గా
భర్త మనోహర్ ఎన్నిక
● ఈ ఎన్నికల్లో భార్య పార్వతికి
అవకాశం..నామినేషన్ దాఖలు
మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ పరిధి రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం రేఖ్యతండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయ్యింది. దీంతో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా మనోహర్ భార్య పార్వతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, పార్వతి గెలుపొందితే దంపతులు ఇద్దరూ సర్పంచ్ పదవి చేపట్టిన వారిగా అరుదైన గౌరవం దక్కనుంది.
దాట్ల..ఆ దంపతులదే..
● 20 ఏళ్లుగా గ్రామపాలన వారిదే..
దంతాలపల్లి : 20 ఏళ్లుగా ఆ కుటుంబం గ్రామపాలన సాగిస్తోంది. భర్త ఇప్పటికే మూడు పర్యాయాలు సర్పంచ్‌గా కొనసాగగా భార్య ఒకసారి.. మొత్తం నాలుగు పర్యాయాలు గెలుపొందారు. ప్రస్తుతం గ్రామం జనరల్ ఉమెన్‌గా రిజర్వ్ కావడంతో ఐదోసారి ఆ కుటుంబం బరిలో నిలిచింది. మండలంలోని దాట్లకు చెందిన కొమ్మినేని రవీందర్ 2001, 2005లో సర్పంచ్‌గా గెలుపొందాడు. 2010లో తన భార్య మంజుల సర్పంచ్‌గా గెలుపొందింది. 2019లో రవీందర్ మళ్లీ సర్పంచ్‌గా గెలుపొంది ప్రస్తుతం తాజా మాజీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో ఐదోసారి జనరల్ ఉమెన్‌కు రిజర్వ్ కావడంతో మరోసారి మంజుల బరిలో నిలిచింది.
కాళ్లు మొక్కి..
ఓటు అభ్యర్థించి..
మహబూబాబాద్ మండలం దామ్యాతండా గ్రామపంచాయతీలో వృద్ధురాలి కాళ్లు మొక్కి ఓటు అభ్యర్థిస్తున్న సీపీఐ బలపరిచిన అభ్యర్థి బానోత్ లింగ్యా నాయక్
ప్రచార పదనిసలు..
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..


