సర్పంచ్ వేతనం @ రూ.6,500
భూపాలపల్లి అర్బన్ : గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయడానికి, గెలువడానికి ఆశావహులు పెద్దసంఖ్యలో ఉత్సాహపడుతుంటారు. పదవిని దక్కించుకోవడానికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. వారి ఉత్సాహం, గెలుపొందడానికి వారు పె డుతున్న ఖర్చు చూసి ప్రజలు సర్పంచ్‌కు ఎంత వేతనమొస్తుందో, ఆ పదవి ద్వారా ఎంత ఆదాయం ఉంటుందో, అందుకే అంతగా ఖర్చు చేస్తున్నారని అనుకుంటుంటారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరిని బతిమిలాడి సర్పంచ్‌గా గెలిస్తే వారికి నెలకు వచ్చే వేతనం రూ.6,500 మాత్రమే. అది కూడా నెలనెలా రాదు. ఎప్పుడో ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసినప్పుడే తీసుకోవాలి. ఇదిలా ఉండగా 1992కు ముందు సర్పంచ్‌కు వేత నం లేదు. ఆ తర్వాత చిన్న జీపీలకు సర్పంచ్‌కు రూ.600, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు రూ.వెయ్యి మాత్ర మే ఇచ్చేవారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, ఏప్రిల్ 1 నుంచి సర్పంచ్ వే తనం రూ.5 వేలు చేశారు. ఆ తర్వాత 2021లో రూ.6,500 పెంచారు. కాగా, 2018 తర్వాత నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో చిల్లిగవ్వ ఆదాయం రాకపోగా పనులు చేయడానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు మీదపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. మరీ ఇంత తక్కువ వేతనం, పనులు చేసినా పైసలు రాకున్నా అంత పోటీ ఎందుకు? అంత ఖర్చు చేస్తారంటే సర్పంచ్ ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఆ హోదా, దర్పం, దర్జా దక్కించుకోవడం కోసం ఉన్న ఆస్తి అమ్మి అయినా, అప్పు చేసైనా విజయం సాధించాలని ఖర్చు చేస్తున్నారు.
అభ్యర్థులూ.. ఆలోచించండి
గెలిచేందుకు రూ.లక్షల్లో ఖర్చు
అభివృద్ధి పనులు చేస్తే
బిల్లుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులే..


