చిల్లర నాణేలతో డిపాజిట్
● వినూత్న రీతిలో నామినేషన్
కురవి: రూపాయి.. రూపాయి కూడబెట్టిన చిల్లర నాణేలతో ఫీజు చెల్లించి నామినేషన్ దాఖలు చేశారో ఓ మహిళా వార్డు అభ్యర్థి. మండలంలోని తాట్యతండాకు చెందిన బోడ వీరన్న భార్య సునీత అదే జీపీలో 8వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీకి దిగారు. నామినేషన్‌కు సంబంధించిన ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంది. దీనికి ఆమె అప్పుడప్పుడు కవర్‌లో దాచుకున్న రూపాయి నాణేలను తీసుకుని భర్తతో కలిసి కొత్తూరు(జీ) గ్రామ పంచాయతీలోని నామినేషన్ కేంద్రంలో అధికారులకు చెల్లించి నామినేషన్ వేసింది. అధికారులు ఆ చిల్లర నాణేలు లెక్కించుకుని నామినేషన్ పత్రాలు స్వీకరించారు.
చిల్లర నాణేలతో డిపాజిట్
చిల్లర నాణేలతో డిపాజిట్


