భారీ రాతి పిల్లర్ ఏర్పాటు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ రాతి పిల్లర్లతోపాటు సాలహారం నిర్మిస్తున్నారు. గద్దెల చుట్టూ ఎనిమిది ఆర్చ్ ద్వారాలు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఆర్చ్ ద్వారం భారీ రాతి పిల్లర్‌ను పునాది(పీడిస్టల్) లో భారీ క్రేన్ల సాయంతో నిలబెట్టారు. పిల్లర్ పై చెక్కిన ఆదివాసీల గొట్టుగొత్రాల, వంశ వృక్షం చిత్రాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. కాగా, పిల్లర్‌ను నిలబెట్టంత వరకు పస్రా సీఐ దయాకర్.. భక్తులను సమీపంలోకి రాకుండా చూశారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
రాయపర్తి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాంసింగ్(22), సీతారాం, తుళ్లు బోరు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిపై ఉన్న 11కేవీ విద్యుత్‌లైన్ తాకడంతో షాక్‌కు గురై రాంసింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారాం, తుళ్లు అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రాజేందర్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, మృతుడి కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.


