పొత్తు.. గమ్మత్తు
వాజేడు: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మ ధ్య రాజకీయ వైరం ఉంది. అయితే వాజేడు మండలం పేరూరులో మాత్రం ఆయా పార్టీల నాయకులు కలిసిపోయారు. ఇక్కడ సర్పంచ్‌గా పోటీ చేస్తు న్న మహిళకు కాంగ్రెస్‌లోని ఒక వర్గంతోపాటు బీ ఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం విశేషం. ఇప్పటికే పేరూ రు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో గొడ్డె వరలక్ష్మి నామినేషన్ దాఖాలు చేశారు. అయితే నా మినేషన్లకు చివరి రోజైన శుక్రవారం అనూహ్యంగా పేరూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత గొడ్డె నాగేశ్వరరావు భార్య సరోజని నామినేషన్ దాఖలు చేశారు. ఈమెకు కాంగ్రెస్‌లోని ఒక వర్గంతోపాటు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. దీంతో సరోజన రెండు పార్టీల కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం కొసమెరుపు.
● ఒకే అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతు


