అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ బుధవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్షప్రభావం, పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.


