నేడు విద్యాసంస్థలకు సెలవు | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యాసంస్థలకు సెలవు

Oct 30 2025 10:22 AM | Updated on Oct 30 2025 10:22 AM

నేడు

నేడు విద్యాసంస్థలకు సెలవు

నేడు విద్యాసంస్థలకు సెలవు దొడ్డు బియ్యం వర్షార్పణం హనుమకొండ జిల్లాలో భారీ వర్షం వృద్ధులను కాపాడిన అధికారులు విద్యార్థినుల తరలింపు

విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్‌: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు నేడు (ఈనెల 30న) సెలవును ప్రకటించారు. కాగా, గురువారం నిర్వహించే సమ్మిటివ్‌–1 పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈఓలు వాసంతి, రంగయ్య నాయుడు, జిల్లా డీసీఈబీ కార్యదర్శి డాక్టర్‌ బి.రాంధన్‌ బుధవారం తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లకు నిర్వహించనున్న శిక్షణలు కూడా వాయిదా వేసినట్లు తెలిపారు.

జూనియర్‌ కళాశాలలకు..

మోంథా తుపాను నేపథ్యంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల డీఐఈఓలు ఎ.గోపాల్‌, శ్రీధర్‌ సుమన్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

హన్మకొండ అర్బన్‌: జిల్లాలోని రేషన్‌ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ ఆ బియ్యాన్ని గోదాంలకు తరలించకుండా కాలయాపన చేశారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం చాలావరకు తడిసిపోయాయి. అధికారులకు 6 నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందని డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికై నా రేషన్‌ షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని అధికారులు గోడౌన్‌కు తరలించాలని డీలర్లు కోరుతున్నారు.

హన్మకొండ: హనుమకొండ జిల్లాలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆటోమెటిక్‌ వెదర్‌స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. హనుమకొండ జిల్లాలో రాత్రి 10 గంటల వరకు భీమదేవరపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.90 సెంటీమీటర్ల వర్షం కు రిసింది. అత్యల్పంగా వేలేరులో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మసాగర్‌లో 33.28 సెంటీమీటర్లు, హసన్‌పర్తిలో 26.95, దామెరలో 24.63, మడికొండలో 22.75, పెద్దపెండ్యాలలో 21.48, కొండపర్తిలో 20.18, కాజీపేటలో 24.50, ఆత్మకూకులో 14.20, పులుకుర్తిలో 13.78, కమలాపూర్‌లో 14.43, నడికూడలో 10.50, ఎల్కతుర్తిలో 10.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంలో 92.8 మిల్లీమీటర్లు, హసన్‌పర్తి నాగారంలో 77, పరకాలలో 80, శాయంపేటలో 71.5, వేలేరులో 3.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్‌ జిల్లాలో సగటు వర్షపాతం 229 మిల్లీమీటర్లు నమోదైంది.

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ రాంనగర్‌ శ్రీనివాస హార్ట్‌ సెంటర్‌ సమీపంలో బుధవారం భారీ వరదలు ముంచెత్తడంతో ఓ ఇంటిగోడ పూర్తిగా కూలిపోయింది. ఆసమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, సుమారు 8 మంది వృద్ధులు ఆ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో అప్పటికే సుమారు నాలుగు ఫీట్ల వరకు వరద నీరు చేరింది. దీంతో వృద్ధులు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న హనుమకొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ దశరథ రాంరెడ్డి, సుబేదారి పోలీసులు తాళ్ల సాయంతో వారిని ఎత్తుకొచ్చి వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో ప్రాణాలతో కాపాడినందుకు రెవెన్యూ పోలీస్‌ అధికారులకు చేతులు జోడించి నమస్కరించారు

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఆర్టీఏ జంక్షన్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌ను వరద నీరు ముంచెత్తింది. కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు బుధవారం రాత్రి తహసీల్దార్‌ ఇక్బాల్‌, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ చేసి 400 మంది విద్యార్థినులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి బస్సుల్లో హసన్‌పర్తి హాస్టల్‌కు తరలించారు. దీంతో తహసీల్దార్‌ ఇక్బాల్‌కు విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిట్‌లోని దాసన్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లోకి వర్షపు నీరు రాగా.. 150 మంది విద్యార్థులను నూతన హాస్టల్‌ బిల్డింగ్‌లోకి తరలించారు.

నేడు విద్యాసంస్థలకు సెలవు1
1/1

నేడు విద్యాసంస్థలకు సెలవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement