ఇబ్బందులు కలగొద్దు
మంత్రి కొండా సురేఖ
వరంగల్: మోంథా తుపాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుంచి వరంగల్ కలెక్టర్‌తో, అధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ డీఆర్డీఓ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు అలర్ట్‌గా ఉండాలన్నారు.


