శ్రేణులు అండగా ఉండాలి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ చౌరస్తా: మోంథా తుపాన్ ప్రభావంతో నగరంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు వారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ప్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.


