చర్యలు చేపట్టండి: వరంగల్ కలెక్టర్
న్యూశ్యాయంపేట: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 18004253424 టోల్ ఫ్రీనంబర్, 9154252936 నంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు.


