కాకతీయుల శిల్పకళ అద్భుతం
హన్మకొండ: కాకతీయుల శిల్పకళా నైపుణ్యం అద్భుతమని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్‌వర్మ అన్నారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన హేమంత్‌వర్మ, అనిత దంపతులు శనివారం హనుమకొండకు చేరుకున్నారు. హోటల్ హరిత కాకతీయలో మధ్యాహ్న భోజనం అనంతరం రామప్పకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు. హేమంత్ వర్మను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఖిలా వరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హేమంత్‌వర్మ మాట్లాడుతూ అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనం వేయిస్తంభాల గుడి అని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర గల వేయిస్తంభాల గుడిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ మూడు కోటల ప్రాకారాలు, వాటి చరిత్రను గైడ్ వివరించారు. వరంగల్ ఎస్‌ఈ కె.గౌతమ్‌రెడ్డి, డీఈలు జి.సాంబరెడ్డి, శెంకేశి మల్లికార్జున్, ఏడీఈ పి.మల్లికార్జున్, ఉద్యోగులు పాల్గొన్నారు.
త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్
చైర్మన్ హేమంత్‌వర్మ


