నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌ | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌

Oct 26 2025 6:41 AM | Updated on Oct 26 2025 6:41 AM

నవంబర

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌ రౌడీషీటర్లపై కఠిన వైఖరి చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ఎంఓయూ కోసం చర్చలు

హన్మకొండ కల్చరల్‌ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు సెకండియర్‌ మొదటి ఇంటర్నల్‌ పరీక్షలు వచ్చే నెల 6నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పీఠం పీఠాధిపతి డాక్టర్‌ గడ్డం వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 99894 17299, 9989 139136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కేయూ క్యాంపస్‌: డయల్‌ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ కేసులపై సమీక్షించి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆయనమ మాట్లాడుతూ ప్రతీ పోలీస్టేషన్‌ పరిఽ ధిలోని రౌడీషీటర్లపట్ల కఠినంగా వ్యవహరిస్తూ నే వారి కదలికలపై దృష్టి పెట్టాలని కోరారు. చోరీలకు పాల్పడిన నిందితులతోపాటు గంజాయి విక్రయదారులపై హిస్టరీ షీట్లను తెరవాలన్నారు. ముఖ్యంగా సైబర్‌ నేరాల్లో బాధితులకు సొమ్మును తిరిగి ఇప్పించడంతోపాటు నేరగాళ్లను పట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ అధికారిగా ఎస్సై స్థాయి అధికారి తప్పకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతీ శుక్రవారం పోలీస్టేషన్లలో శ్రమదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్‌, అంకిత్‌కుమార్‌, ఏఎస్పీ చేతన్‌నితిన్‌, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

మామునూరు: బాలికలపై జరిగే దాడులు, చట్టపరమైన రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంచుకోవాలని వరంగల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కందుకూరి పూజ అన్నారు. ఈమేరకు శనివారం మామునూరు నవోదయ విద్యాలయంలో వరంగల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, ఎస్సై కృష్ణవేణి ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి కందుకూరి పూజ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేశ్‌, పీసీ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: వర్జీనియాలోని ఫెయిర్‌ ఫాక్స్‌లో ఉన్న జార్జ్‌ మాసన్‌ విశ్వవిద్యాలయం (జీఎంయూ) ప్రతినిధి బృందం కాకతీయ యూనివర్సిటీని సందర్శించినట్లు శనివారం కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం, ప్రొఫెసర్లు బి.వెంకట్రామ్‌రెడ్డి, పి.మల్లారెడ్డి, ఎం.సదానందం, డాక్టర్‌ బి.రమ, డాక్టర్‌ డి.రమేశ్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ రమణ, డాక్టర్‌ భిక్షాలు, స్టూడెంట్స్‌ అఫేర్స్‌ డీన్‌ మామిడాల ఇస్తారితో జీఎంయూ బృంద సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈబృందంలో గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కమ్మీ సంఘీర, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అసోసియేట్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాబర్ట్‌ పిటిట్‌ ఉన్నారు.

దివ్యాంగుల సమస్యలు

పరిష్కరించాలి

న్యూశాయంపేట: దివ్యాంగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని వరంగల్‌ జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి అన్నారు. కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి 10 ఫిర్యాదులు స్వీకరించారు. జెడ్పీ సీఈఓ 1, సివిల్‌ సప్లయీస్‌ 3, ఈడీఎం 1, మెప్మా పీడీ 1, డీఎంహెచ్‌ఓ 1, డీఆర్డీఏకు 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను అధికారులకు ఎండార్స్‌ చేశారు. అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌1
1/2

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌2
2/2

నవంబర్‌ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్‌ ఇంటర్నల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement