అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడ
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)
కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు.
ఒంటరి మనుషుల మోముల్లో
చిరునవ్వు నింపుతున్న కొందరు
ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట..
పండ్లు.. కడుపు నిండా భోజనం
ఇటీవల పెరిగిన సేవా దృక్పథం
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడ


