‘లక్కు’ దక్కేదెవరికో..
సాక్షిప్రతినిధి, వరంగల్ :
2025–27 ఎకై ్స జ్ టెండర్లలో అదృష్టజాతకులెవరో సోమవారం తేలనుంది. వచ్చే రెండేళ్ల కోసం మద్యం దుకాణాలను నిర్వహించే అవకాశం ఉమ్మడి వరంగల్‌లో ఎవరికి దక్కనుందో వెల్లడి కానుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున.. 10,493 మంది రూ.314.79 కోట్లు ఫీజు రూపేణా చెల్లించారు. వాస్తవానికి దరఖాస్తుల గడువు ఈ నెల 18 తేదీనే ముగిసినప్పటికీ.. మరో ఐదు రోజులు పొడిగించి 23కు మార్చారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని 294 వైన్స్(ఏ–)షాపులకు 9,754 దరఖాస్తులు రాగా.. 23 వరకు 739 పెరిగి మొత్తం 10,493లకు చేరింది. ఇందులో గౌడ కులస్తులకు కేటాయించిన దుకాణాలకు 2,050 దరఖాస్తులు రాగా, ఎస్సీ రిజర్వుడ్‌పై 1,023, ఎస్టీలపై 651, ఓపెన్ టెండర్లపై 6,769 వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ అధికారులు ప్రకటించారు. 10,439 దరఖాస్తుల్లో 294 మందికే వైన్‌షాపులు దక్కనుండగా, ఆ ‘లక్కీ’ వరించే 294 మంది ఎవరో? అన్న సస్పెన్స్‌కు రేపు తెరపడనుంది.
గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు
2023–25 టెండర్లతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఫలితంగా దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా ఆదాయం ఊహించిన మేర రాలేదు. గత టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లో 294 షాపులకు 16,039 దరఖాస్తులు రాగా, రూ.320.78 కోట్లు ఆదాయం ప్ర భుత్వానికి సమకూరింది. ఈసారి అదేస్థాయిలో.. అంతకంటే ఎక్కువ కూడా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో అదనంగా పెరిగిన అప్లికేషన్ ఫీజు రూ.లక్ష కలిపి దరఖాస్తుల ద్వారా రూ.481 కోట్ల నుంచి రూ.520 కోట్ల వరకు రావొచ్చనుకున్నారు. కానీ, ఈసారి ఆశించిన మేర స్పందన లేక గడువు పొడిగించినప్పటికీ గతంతో పోలిస్తే 5,546 తక్కువ వచ్చాయి. మొత్తం 10,493 దరఖాస్తులు రాగా.. వాటిపై రూ.314.79 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కాగా ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ గత టెండర్లలో మద్యం వ్యాపారం తడాఖా చూపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగులు పలువురు తప్పుకున్నారు. దీంతో టెండర్ షెడ్యూళ్ల సంఖ్య తగ్గగా.. టెండర్లు వేసిన వారిలో మద్యం దుకాణాలు దక్కించుకునే అదృష్ట జాతకులెవరో? ఎవరికి ఆ దుకాణాలు దక్కుతాయో?నన్న చర్చ జోరుగా సాగుతోంది.
లక్కీ డ్రాకు విస్తృత ఏర్పాట్లు..
మద్యం షాపులు ఖరారు చేసేందుకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాకు సంబంధించి 67 షాపులకు దాఖలైన 3,175 దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా తీసేందుకు అంబేడ్కర్ భవన్ వేదికగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలో 57 వైన్‌షాపులకు దాఖలైన 1,958 దరఖాస్తుల నుంచి ఎంపిక చేసేందుకు వరంగల్‌లోని నాని గార్డెన్స్‌లో డ్రా తీయనున్నారు.
రేపు మద్యం దుకాణాలకు
లక్కీ డ్రా
ఉదయం 11 గంటల నుంచి డ్రా...
కలెక్టర్ల సమక్షంలో తీసేందుకు ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 10,493 దరఖాస్తులు.. ఆదాయం రూ.314.79 కోట్లు
జిల్లా వైన్స్‌లు 18 వరకు వచ్చిన 23 వరకు వచ్చిన
(ఏ–4) దరఖాస్తులు దరఖాస్తులు
హనుమకొండ 67 3,012 3,175
వరంగల్ 57 1,826 1,958
జనగామ 50 1,587 1,697
మహబూబాబాద్ 61 1,672 1,800
భూపాలపల్లి/ములుగు 59 1,657 1,863
294 9,754 10,493


