
ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ విద్యు త్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ చంద్రారెడ్డి, కోకన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ కోరారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డికి డిమాండ్‌ల నోటీసు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 23, 667 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. ఎని మిది సంవత్సరాలుగా ఆర్టిజన్లకు ప్రయోజనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్, అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాంత్, జి.అనంత రెడ్డి, మహేందర్ గౌడ్, బి.శ్రీనివాస్, కలకోట అశోక్, చింతలపూడి సతీశ్ కుమార్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ వినతి