
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కమిషనరేట్ పరిధిలో రెచ్చిపోతున్న పేకాటరాయుళ్లు రూ.లక్షలు పెట్టి పత్తాలాట
ఈ నెల 12న : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్‌రెడ్డితో పాటు 11మంది పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. రూ.60,610 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 20న : వరంగల్ సబ్ డివిజన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ 13మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుడు దోనెపూడి రమేష్‌బాబు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ తదితరులు ఉన్నారు. వీరినుంచి రూ.3.68లక్షల నగదు, 11సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 19న : హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీనివాస్ కాలనీలో నందికొండ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. ఇందులో ప్రముఖ వ్యాపారులతోపాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు భీరం సుధాకర్‌రెడ్డి పట్టుబడ్డారు. 30 ఏళ్ల యువతి కూడా ఉంది. వీరినుంచి రూ.1,27,650 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అపార్ట్‌మెంట్లు, ప్రముఖుల ఇళ్లు,
పండ్ల తోటలే అడ్డాలు
‘టాస్క్‌ఫోర్స్’కు పట్టుబడుతున్న రాజకీయ ప్రముఖులు
మహిళలు సైతం పట్టుబడుతున్న వైనం
దృష్టి సారించని స్థానిక పోలీసులు

బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025