
పనుల్లో నిర్లక్ష్యం తగదు
● కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్ : కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనుల్లో నిర్లక్ష్యం తగదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం మ్యూజికల్ గార్డెన్‌లో కొనసాగుతున్న పనులను కమిషనర్ పరిశీలించారు. గ్రీనరీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనులు దాదాపు పూర్తి కాగా మిగిలిన ప్యాచ్ వర్క్ పనులపై దృష్టి సారించి, త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ‘కుడా’ హార్టికల్టర్ అధికారి ఆసిఫ్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.