
టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ
హన్మకొండ: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కన్వీనర్‌లుగా శ్రీకాంత్, డి.రవీందర్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు చైర్మన్ ధరావత్ సికిందర్ మంగళవారం తెలిపారు. కోకన్వీనర్‌గా జి.అనంతరెడ్డి, కో చైర్మన్‌గా టి.తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్‌గా మహేందర్ గౌడ్, కోశాధికారి అటికేటి రవీందర్, చింతలపూడి సతీశ్‌కుమార్ ఎన్నికయ్యారని వివరించారు.
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
అక్టోబర్ 23, 28వ తేదీల్లో చర్లపల్లి–దానాపూర్ (07091) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 24, 29వ తే దీల్లో దానాపూర్–చర్లపల్లి (07092) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 26వ తేదీన చర్లపల్లి–దానా పూర్ (07049) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 27వ తేదీన దానాపూర్–చర్లపల్లి (07050) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, త్రిటైర్ ఏసీ, స్లీపర్‌క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లి–దానాపూర్ మధ్య కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కాట్ని, మహియర్, సంత, ప్రయాగ్‌రాజ్ చోకి, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ నిర్మాణానికి బుధవారం ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. రూసా నిధులు రూ. 3కోట్ల 50లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు. ఈ నిర్మాణం పూర్తయిన అనంతరం సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన పరిశోధనలకు అవసరమైన ఈక్విప్‌మెంట్లను (పరికరాలను) ఏర్పాటు చేస్తారు. కాగా, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్, రూసా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవసేన (ఐఏఎస్), కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, రూసా ప్రాజెక్టు ఆఫీసర్ సౌందర్యజోసెఫ్.. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆర్చరీ పోటీలకు కేయూ జట్లు
కేయూ క్యాంపస్ : పంజాబ్‌లోని భటిండాగురు కాశీ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 31వ తేదీవరకు నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూని వర్సిటీ ఆర్చరీ పోటీలకు పురుష, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. ఇండియన్ రౌండ్ (పురుషులు) టి.సునీల్‌కుమార్ (ప్రభుత్వ డి గ్రీ కళాశాల, నిర్మల్), రికర్వ్ రౌండ్ బి.గంగరాజు (కేడీసీ, హనుమకొండ), త్రిశూల్ (సమత డిగ్రీ కళా శాల, తొర్రూరు), ఇ.ఆనంద్, కె.అశ్వత్‌దొ ర (ప్రభు త్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం), రికర్వ్ రౌండ్ (మహిళలు) తన్వీన్ కౌసర్ (సీకేఎం కాలేజీ, వరంగల్), మన్సురహాహాసిబా (పద్మావతి కళాశాల, వరంగ ల్) ఎంపికయ్యారు. ఈ బృందానికి కోచ్ కమ్ మేనేజర్‌గా న్యూసైన్స్ డిగ్రీ కళాశాల వ్యా యామ అధ్యాపకుడు రాజేశ్ వ్యవహరిస్తారు.
హన్మకొండ: వరంగల్ మహానగరపాలక సంస్థ 57వ డివిజన్ హనుమకొండ గాంధీనగర్ వాసులపై దీపావళి రోజు సోమవారం రాత్రి వీ ధికుక్కల గుంపు దాడి చేసింది. మొత్తంగా ఏ డుగురికి గాయాలయ్యాయి. వారు ఎంజీఎంలో చికిత్స పొందారు. కుక్కలు కరిచిన విషయాన్ని గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షు డు వెంకట రాజిరెడ్డి, కార్పొరేటర్ స్వరూపరా ణిలు.. మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం బల్దియా సిబ్బంది కుక్కలను ప ట్టుకెళ్లారు. కొన్ని వలకు చిక్కకుండా తప్పించుకున్నాయని కాలనీ వా సులు తెలిపారు. మంగళవారం బాధితులను గాంధీనగర్ అభివృద్ధి కమి టీ సభ్యులు పరామర్శించారు.