84,654 మందికి పోలియో చుక్కలు | - | Sakshi
Sakshi News home page

84,654 మందికి పోలియో చుక్కలు

Oct 15 2025 6:20 AM | Updated on Oct 15 2025 6:20 AM

84,65

84,654 మందికి పోలియో చుక్కలు

84,654 మందికి పోలియో చుక్కలు ఉద్యోగుల నమోదుకు అవకాశం వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.11,86,967 ఎన్‌ఐఎస్‌లో వరంగల్‌ జిమ్నాస్ట్‌లు టాప్‌

ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో 84,654 మంది (100.4 శాతం) పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ.అప్పయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం 472 పోలియో కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌, మొబైల్‌ బృందాలతో పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కార్యక్రమాన్ని పరిశీలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపల్‌ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, నర్సింగ్‌ విద్యార్థులు పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు.

హన్మకొండ అర్బన్‌: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ద్వారా 1 జూలై 2017 నుంచి 31 అక్టోబర్‌ 2025 మధ్య కాలంలో సంస్థలో చేరిన, ఈపీఎఫ్‌లో నమోదు కాకపోయిన, ప్రస్తుతం జీవించి ఉన్న, ఉద్యోగంలో ఉన్నవారిని ఈపీఎఫ్‌ఓ అందించే ఆన్‌లైన్‌ సౌకర్యం ద్వారా సంస్థలు ఉద్యోగుల నమోదు చేసుకోవాలని వరంగల్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌–2 వైడీ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత కవరేజీ పెరుగుతుందని, సంస్థలు తక్కువ ఆర్థిక, చట్టపరమైన భారంతో గత రికార్డులను సాధారణీకరించుకోవచ్చని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు వరంగల్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కార్యాలయాన్ని సందర్శించాలని ఆయన సూచించారు.

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలల 20 రోజుల హుండీ ఆదాయం 5,56,967 రూపాయలు, పూజా టికెట్ల ద్వారా రూ.6,30,000 వచ్చింది. మొత్తం ఆదాయం రూ. 11,86,967 సమకూరిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్‌ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్‌, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ విడుదల చేసిన జిమ్నాస్టిక్‌ డిప్లొమా ఇన్‌ కోచింగ్‌ 2024–25 ఫలితాల్లో వరంగల్‌ జిమ్నాస్ట్‌లు జాతీయస్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించారు. వరంగల్‌లోని ఉర్సుకు చెందిన పేర్న సూర్యదేవ్‌ 72.12 శాతం మార్కులతో మొదటి ర్యాంకు, హనుమకొండలోని గుడిబండల్‌కు చెందిన జంగా శివసాయి 68.07 శాతంతో నాలుగో ర్యాంకు, లష్కర్‌బజార్‌కు చెందిన తెల్లి ప్రశాంత్‌ 60.83 శాతంతో సెకండ్‌ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని జిమ్నాస్టిక్‌ అకాడమీలో 2009 నుంచి 2021 వరకు ముగ్గురు క్రీడాకారులు శిక్షణ పొందారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి అనేక జాతీయస్థాయి జిమ్నాస్టిక్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వరంగల్‌ ఖ్యాతిని దేశం నలుమూలల చాటిన ముగ్గురు క్రీడాకారులను జిమ్నాస్టిక్స్‌ వరంగల్‌ జిల్లా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నెమరుగొమ్ముల రమేశ్‌రావు అభినందించారు.

84,654 మందికి  పోలియో చుక్కలు1
1/1

84,654 మందికి పోలియో చుక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement