
ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను శుభ్రంగా ఉంచాలి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నిర్వహణ సమర్థవంతంగా కొనసాగించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ పోతన నగర్‌లో బల్దియా నిర్వహిస్తున్న పోతన, బాలసముద్రంలోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను మేయర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ఆవరణలో ప్లాంటేషన్ కోసం మొక్కలు నాటాలని కోరారు. ఇండోర్ మాదిరిగా శుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ ఆటోల ద్వారా వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు డంప్ యార్డుకు తరలించాలని, ట్రాన్‌్స్‌ఫర్ స్టేషన్‌లో రెండు వాటర్ సర్వీసింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని, డ్రైవర్లు వాహనాల మరమ్మతులు చూసుకోవాలని పేర్కొన్నారు. ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, మహేందర్, డీఈలు రాజ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈలు నరేశ్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.