
ఈత కొట్టేదెన్నడో?
బోసిపోతున్న
స్విమ్మింగ్‌పూల్
వరంగల్ స్పోర్ట్స్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లేమి కారణంగా యువ స్విమ్మర్లు సాధనకు దూరమవుతున్నారు. నిత్యం సాధన చేస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడే స్విమ్మర్లకు స్విమ్మింగ్‌పూల్ మరమ్మతులు అడ్డంకిగా మారాయి. సుమారు ఆరు నెలలుగా సాధన లేక మానసికంగా, శారీరకంగా కుదేలవుతున్నారు.
రూ.41 లక్షలు కేటాయింపు..
హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రా
ధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ కొనసాగుతోంది. పూల్‌లో పలు మరమ్మతులు, వసతుల కల్పన కోసం డీఎస్‌ఏ నిధుల నుంచి రూ.41 లక్షలు కేటాయించారు. ఆయా పనుల్ని పూర్తి చేసేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. సుమారు ఆరు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. త్వరతగతిన పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
పనుల్లో జాప్యం..
టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అబివృద్ధి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులను చేస్తుండడంతో ఆరు నెలలు కావొస్తున్నా.. పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్విమ్మింగ్ పూల్. అలాంటిది ఆరు నెలలుగా మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పనుల్లో జాప్యం కారణంగా యువ స్విమ్మర్ల కెరియర్ నష్టపోతుంటే, ఆరోగ్య పరిరక్షణ కోసం స్విమ్మింగ్ పూల్‌కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు.
స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనులు 90 శాతం పూర్తయ్యాయి, రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ సైతం విజయవంతంగా పూర్తి చేశాం. చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో డీఎస్‌ఏకు స్విమ్మింగ్ పూల్‌ను అప్పగిస్తాం.
– రవీందర్, డీఈ,
టీజీఈడబ్ల్యూఐడీసీ, హనుమకొండ
ఆరు నెలలైనా పూర్తికాని మరమ్మతులు
సాధనకు దూరమవుతున్న స్విమ్మర్లు

ఈత కొట్టేదెన్నడో?

ఈత కొట్టేదెన్నడో?

ఈత కొట్టేదెన్నడో?

ఈత కొట్టేదెన్నడో?