
ఓరుగల్లును మరువలేను
● హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
● ఎక్స్‌లో ట్వీట్ చేసిన ‘సాక్షి’ క్లిప్పింగ్
ఖిలా వరంగల్: ‘చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. నా హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు.