
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్‌లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట హెచ్‌ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
మేయర్ గుండు సుధారాణి