
బీసీలు బలహీనులు కాదు
● ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్
హన్మకొండ: రిజర్వేషన్లు బీసీల పౌర హక్కు అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్‌లో సుందర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. బీసీలు బలహీనులు కాదని, బాహుబలులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం అవకాశం కల్పిస్తామని ఆశ చూపి మోసం చేశారన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఆయా సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, మౌనిక గౌడ్, పులి రజనీకాంత్, మేధావులు పాల్గొన్నారు.