బీసీలకు సముచిత స్థానం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

Oct 13 2025 6:06 AM | Updated on Oct 13 2025 6:06 AM

బీసీల

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

హన్మకొండ: టీపీసీసీ త్వరలో చేపట్టనున్న జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ చేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా నిర్వహించనున్న కాంగ్రెస్‌ పార్టీ పదవుల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 17 డీసీసీ అధ్యక్ష పదవులు, వరంగల్‌ ఉమ్మడి 6 జిల్లాల్లో 3 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించి మాట నిలుపుకోవాలని ఏఐసీసీ, టీపీసీసీని కోరారు.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ కమిటీ

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల కళాశాలల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్‌రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్‌ డైరెక్టర్‌), ఉపాధ్యక్షులుగా పి.అజయ్‌, ఎస్‌.కుమారస్వామి, బి.రమేశ్‌, జి.సునీత, కోశాధికారిగా ఎస్‌.కిరణ్‌కుమార్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్‌, బి.వెంకట్రామ్‌, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మహ్మద్‌ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది.

క్రెడాయ్‌ సేవలు

అభినందనీయం

హన్మకొండ చౌరస్తా: క్రెడాయ్‌ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో ఆదివారం పబ్లిక్‌గార్డెన్‌లో నేరెళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం గొప్ప పుణ్యకార్యం, అలాంటి కార్యక్రమంలో యువత ముందుండడం సంతోషంగా ఉందన్నారు. మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, రెడ్‌క్రాస్‌ పాలకమండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావు, క్రెడాయ్‌ వరంగల్‌ అధ్యక్షుడు నాయిని అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్‌, చైర్మన్‌ తిరుపతిరెడ్డి, బాధ్యులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కొండారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

కడిపికొండలో

కారు బీభత్సం

కాజీపేట అర్బన్‌ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో ఆదివారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాజీపేట నుంచి వరంగల్‌ వైపునకు వెళ్తున్న కారు ఓవర్‌ స్పీడ్‌తో కడిపికొండ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టగా అతడికి తీవ్రగాయాలయ్యా యి. ఇదే కారు కొద్ది దూరంలోని వైన్స్‌ ఎదుట రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టగా కాలు విరిగింది. క్షతగాత్రులను 108 సిబ్బంది శివకుమార్‌, రాజ్‌సింగ్‌ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, కారు డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కారును మడికొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి1
1/2

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి2
2/2

బీసీలకు సముచిత స్థానం కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement