
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆదివారం పల్స్‌పోలియోను నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత
ఖిలా వరంగల్: రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్ట పీహెచ్‌సీ కేంద్రంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పల్స్‌పోలియో సక్సెస్..
గీసుకొండ: వరంగల్ నగర పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 20,128 (స్థానికేతరులతో కలిపి) మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.