
ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని యాజమాన్యాలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ ఈఈయూ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే గ్రేడ్ పదోన్నతి కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. కాగా, ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై హై దరాబాద్‌లో విద్యుత్ సంస్థల్లోని యూనియన్లతో చ ర్చించి జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. ఆర్టిజన్ జేఏసీ చైర్మన్‌గా టీఎస్‌ఈఈయూ–327కు కేటాయించగా నాలుగు విద్యుత్ సంస్థలకు చైర్మన్లను ఎన్నుకున్న ట్లు తెలిపారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్‌గా డి.సికిందర్, ఎస్పీడీసీఎల్ చైర్మన్‌గా ఎస్.సతీశ్‌రెడ్డి, జెన్‌కో చై ర్మన్‌గా రమేశ్‌కుమార్, ట్రాన్స్‌కో చైర్మన్‌గా కల్యాణ్ ను ఎన్నుకున్నట్లు వివరించారు. యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ శ్రీనివాస్, జెన్‌కో ప్రెసిడెంట్ మాధవరావు, రాష్ట్ర నాయకులు తులసి శ్రీమతి, ధరావత్ సికిందర్, సుంకు సతీశ్ రెడ్డి పాల్గొన్నారు.
టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్