గ్రేటర్ వరంగల్ పరిధి అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో శుక్రవారం ‘స్వాగతం–25’ వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ గాయకులు దమనిభట్ల, అర్జున్ విజయ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. తొలుత విద్యార్థినులు ర్యాంప్‌వాక్ నిర్వహించారు. పెయింటింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వంటి సృజనాత్మక అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ మహేశ్, విద్యార్థి సంక్షేమ డీన్ డాక్టర్ ఏ.వి.వి.సుధాకర్, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
– హసన్‌పర్తి