శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Oct 11 2025 9:30 AM | Updated on Oct 11 2025 9:30 AM

శనివా

శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

ఫస్ట్‌ ఆఫ్‌లో ఆస్తి పన్ను 25%

నీటి చార్జీలు కేవలం

12% వసూలు

నిద్రావస్థలో పన్నుల విభాగం అధికారులు

జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితిపై

తీవ్ర ప్రభావం

వరంగల్‌ అర్బన్‌: పన్నుల వసూళ్లలో గ్రేటర్‌ వరంగల్‌ చతికిల పడింది. ఫస్ట్‌ ఆఫ్‌ ఆరు నెలల వ్యవధిలో ఆస్తి పన్ను 25 శాతం, నీటి చార్జీలు 12 శాతం వసూళ్లతో ఆయా విభాగా అధికారులు సరిపెట్టుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)కి ప్రధాన ఆదాయ వనరు పన్నులు. డిమాండ్‌ మేరకు ఏటా ఆస్తి, నీటి పన్నులు కచ్చితంగా వసూలు చేస్తేనే స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. కొత్త ఇంటి నంబర్ల జారీ, భవనాల రివైడ్జ్‌, పేరు మార్పిడుల పేరిట కాసుల కోసం వేట కొనసాగిస్తున్నారే తప్ప పన్ను వసూళ్లపై సరైన కార్యాచరణతో ముందుకు సాగట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో పన్నుల వసూళ్లను ఫస్ట్‌ ఆఫ్‌, సెకండ్‌ ఆఫ్‌గా వసూలు చేస్తుంటారు. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు, రెండో దఫా అక్టోబర్‌ 1 నుంచి మార్చి 31 వరకు వర్గీకరించి పన్నులు వసూలు చేస్తుంటారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ)సూచనల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడాదికి ఒకేసారి డిమాండ్‌ నోటీస్‌ జారీ చేశారు. కానీ, అందులో ఆర్నెళ్లకోసారి చెల్లించుకునే పొందుపర్చారు.

వసూళ్లు ఇలా..

మహా నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను అసెస్‌మెంట్లు 2,28,901 కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.81.18 కోట్లు, వడ్డీ రూ.46.06 కోట్లు, పాత బకాయిలు రూ.43.60 కోట్లు మొత్తంగా రూ.170.80 కోట్లు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ.42.10 కోట్లు అంటే 25 శాతం వసూలు చేశారు. ఇకపోతే తాగునీటి నల్లా కనెక్షన్లు 1,77,567 ఉండగా.. రూ.49.70 కోట్లు కరెంటు, పాత బకాయిలు రూ.25.28 కోట్లు కాగా, మొత్తంగా రూ.74.99 కోట్లు డిమాండ్‌ నెలకొంది. ఇందులో 8.87 కోట్లు అంటే 12 శాతం మాత్రమే వసూలు చేశారు. సర్కారీ శాఖల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తి, నీటి చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చొరవ తీసుకునే నాథుడే బల్దియా యంత్రాంగంలో కరువయ్యారనే విమర్శలు నెలకొన్నాయి.

లోపం యంత్రాంగానిదే..

పన్ను బకాయిలు పెరిగిపోవడానికి, సక్రమంగా వసూలు అవ్వకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణం. ప్రజలకు నోటీసులు జారీ చేయడంతో సరిపెట్టకుకోకుండా ప్రజలు సక్రమంగా చెల్లిస్తున్నారా? చెల్లించని వారికి ఆ సొమ్ముపై 2శాతం వడ్డీ భారం తోడవుతుందని చెల్లింపుదారుల్లో చైతన్యం కల్పించడంతో విఫలమవుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లు కలిసి వసూళ్ల బాధ్యత ఇ–సేవా కేంద్రాల సిబ్బందికి వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తి, నీటి చార్జీలు ఫస్ట్‌ ఆఫ్‌లో వెనుకబడిపోవడానికి పన్నుల విభాగం అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎవరికి వారు దాటవేస్తుండడం గమనార్హం.

శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20251
1/1

శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement