మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

Oct 11 2025 9:30 AM | Updated on Oct 11 2025 9:30 AM

మానసి

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి వైన్స్‌కు 16 దరఖాస్తులు బీమా చెక్కు అందజేత నిట్‌ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి వేయిస్తంభాల గుడిలో సంకటహర చతుర్థి పూజలు

హన్మకొండ అర్బన్‌: విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభి రామారావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని బన్ను న్యూరో హెల్త్‌ అండ్‌ రిహబిలిటేషన్‌ సెంటర్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌ పాండే ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిన్నారుల మానసిక ఆరోగ్య స్థితిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వారు ఒత్తిడిని అధిగమించి మానసిక ఆరోగ్యం పొందేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి శ్రీనివాస్‌రావు, కేయూసీ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి ఎంజీఎం ఆస్పత్రి సైకియాట్రిక్‌ విభాగం డాక్టర్‌ చిమ్మి కృష్ణ, బన్ను ఆరోగ్య ది సేవా సొసైటీ అధ్యక్షుడు వీరమల్ల చంద్రజిత్‌రెడ్డి, బన్ను స్పెషల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వీరమల్ల కిరణ్‌కుమారి, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్‌కు గాను శుక్రవారం 16 దరఖాస్తులను హనుమకొండ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌కు మద్యం వ్యాపారులు అందజేశారు. కాగా, వైన్స్‌ టెండర్ల ప్రకటన వెలువడినప్పటి నుంచి శుక్రవారం వరకు మొత్తం 65 దరఖాస్తులు అందాయి.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ కమిషనరేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ హతీరామ్‌ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్‌ యాకుబ్‌ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: సమాజంలో నిట్‌ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్‌ సనక్‌ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్‌ అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన నిట్‌ వరంగల్‌ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్‌ ఆఫ్‌ ది హైయరార్కీ ఆఫ్‌ నాలెడ్జ్‌’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్‌ వరంగల్‌ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాదర్‌ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్‌ వరంగల్‌లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు సాధించడం నిట్‌కు గర్వంగా నిలుస్తోందన్నారు.

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు పెండ్యాల సందీప్‌శర్మ, పానుగంటి ప్రణవ్‌, శ్రవణ్‌ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు.

మానసిక ఆరోగ్యానికి  ప్రాధాన్యం ఇవ్వాలి1
1/1

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement