
స.హ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్‌ను కలిసిన
శిక్షణ డిప్యూటీ కలెక్టర్
గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.