పెన్షనర్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

Oct 11 2025 6:40 AM | Updated on Oct 11 2025 6:40 AM

పెన్షనర్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

పెన్షనర్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

హన్మకొండ అర్బన్‌ : రిటైర్డ్‌ పెన్షనర్లకు వెంటనే బెనిఫిట్స్‌ చెల్లించాలని శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ సీతారాం మాట్లాడారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2024,మార్చి నుంచి రిటైర్డ్‌ అయిన పెన్షనర్లకు బెనిఫిట్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెన్షనరీ బెనిఫిట్స్‌ రాక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఈహెచ్‌ఎస్‌ ద్వారా ఉచిత వైద్యం పొందుతున్నామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం రూపొందించి సత్వరం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండ్యాల బ్రహ్మయ్య, జె.ప్రభాకర్‌ రెడ్డి, నారాయణగిరి వీరన్న, వన్నాల రాజమల్లు, సుధాకర్‌, శంకరయ్య, మండువ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement