
రేపు వరంగల్‌లో పల్స్‌పోలియో
మాట్లాడుతున్న డీఆర్‌ఓ గణేశ్
మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
గీసుకొండ: వరంగల్ నగరలో 0–5 ఏళ్లలోపు ఉన్న 20,121 మంది పిల్లలకు ఈ నెల 12న పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సబ్ నేషనల్ పోలియో వ్యాక్సినేషన్‌పై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం వరంగల్ నగర ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకుని వెళ్లి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ నగరంలోని సీకేఎం, ఎంజీఎం, చింతల్, దేశాయిపేట, ఫోర్టు వరంగల్, కీర్తినగర్, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, కాశిబుగ్గలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చుక్కల మందు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాన్సిస్ట్ పాయింట్లు, మరో ఏడు మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, ట్రాన్సిస్ట్ సెంటర్లలో 24 గంటలపాటు చుక్కల మందు వేస్తారని చెప్పారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలియో చుక్కలు తప్పనిసరి:
డీఆర్‌ఓ గణేశ్
ఎంజీఎం: ఈనెల 12న(ఆదివారం) చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత విభాగాల, ప్రోగ్రాం అధికారులతో పల్స్ పోలియో డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్‌ఓ గణేశ్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అప్పయ్య మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్లలోపు వయస్సున్న 84,301 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు (472) పోలియో చుక్కల కేంద్రాలను (17) ట్రాన్సిట్ పాయింట్లు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య వైద్యాధికారి రాజారెడ్డి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ టి.మదన్మోహన్ రావు, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు

రేపు వరంగల్‌లో పల్స్‌పోలియో