
కేఎంసీలో వైట్‌కోట్ సెరిమనీ
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమనీ ఎన్‌ఆర్‌ఐ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య సుంకరనేని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, చికాగో(కేఎంసీ పూర్వ విద్యార్థి) డాక్టర్ సురేష్ రెడ్డి, సీనియర్ అలుమ్నస్ డాక్టర్ వీ.ఎల్.ఎన్.రావు హాజరయా ్యరు. ఈ సందర్భంగా వారు వైద్య వృత్తి ప్రాధాన్య త, సేవా దృక్పథం, నైతిక విలువలౖ పె విద్యార్థుల కు వివరించారు. అనంతరం ప్రి న్సిపాల్ విద్యార్థులతో హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. ఎంజీ ఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ పాల్గొన్నారు.