
‘డ్రీమ్‌బిగ్’ ఆడియో ఆవిష్కరణ
హన్మకొండ చౌరస్తా : వరంగల్ నగరానికి చెందిన ఫిజియోథెరపిస్టు రావుల రామకృష్ణ నిర్మించిన ‘డ్రీమ్ బిగ్’ సినిమా ఆడియో, వీడియో ఆవిష్కరణ శుక్రవారం హనుమకొండలోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సామాజిక భావాలు ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.ఆలోచనలు గొప్పగా ఉంటేనే విజయం తథ్యమని వివరించారు. భవిష్యత్‌లో భావితరాలకు ఉపయోగపడే సినిమాలను తీయాలని, తమవంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఫిజియోథెరపిస్టు ఒక డైరెక్టర్‌గా సినీ రంగంలో అడుగుపెట్టి ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఒడితల రాము, శివరామకృష్ణ, సురేష్, ప్రకాశ్, క్రాంతికుమార్, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు.