
జాతీయ సైన్స్ సెమినార్‌లో రాణించాలి
విద్యారణ్యపురి: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న జాతీయ సైన్స్ సెమినార్‌లో రాణించాలని జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాస్‌స్వామి కోరారు. బుధవారం లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లాస్థాయి జాతీయ సైన్స్‌సెమినార్ నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 18 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న అపూర్వశ్రీవాస్తవ రాష్ట్రస్థాయి జాతీయ సెమినార్‌కు ఎంపికయ్యారు. పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఎం.మన్వితారెడ్డి ద్వితీయ స్థానం, ఐనవోలులోని ఏకశిల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వై.రేష్మ తృతీయ స్థానం సాధించారు. కేడీసీ కంప్యూటర్ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రవణకుమారి, వాగ్దేవి డిగ్రీ కాలేజీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు బి.స్వప్న న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈనెల 18న హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో నిర్వహించే రాష్ట్రస్థాయి జాతీయ సైన్స్‌సెమినార్‌లో అపూర్వశ్రీవాస్తవ పాల్గొననున్నారు.