
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
హన్మకొండ చౌరస్తా : టీజీఎస్ ఆర్‌టీసీ చేపట్టిన ‘యాత్రాదానం’ వాల్ పోస్టర్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. పుట్టిన రోజు, వార్షికోత్సవం, పండుగలు, ఇతర శుభకార్యాలు, ప్రత్యేకమైన రోజుల్లో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు యాత్రాదానం ఉపయోగపడుతుందన్నారు. టూర్ ప్రారంభానికి వారం ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. 80745 62195, 98663 73825, 9959226047 నంబర్లకు ఫోన్ చేసి టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ సంతోష్‌కుమార్, టూర్ ప్యాకేజీ ఆఫీసర్ రాతిపల్లి సాంబయ్య పాల్గొన్నారు.