
ఘనంగా విశ్వకర్మ యజ్ఞం
హన్మకొండ కల్చరల్ : వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో బుధవారం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి విశ్వకర్మ పూజారులు గూటోజు కేదారీశ్వరాచారి ఆధ్వర్యంలో అర్చకులు సుప్రభాత సేవ, బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, వివిధ పూజలు చేశారు. అనంతరం విశ్వకర్మ యజ్ఞంలో భాగంగా గణపతి, నవగ్రహ పూజలు, యజ్ఞం, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మారేడోజు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి జల్లిపల్లి పెంటయాచారి, సభ్యులు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.