
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. దేవాదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు కె.కుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తగా నియమితులైన కటకం రాములు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, భద్రకాళి దేవాలయ ధర్మకర్తల మండలిలో ఎస్.శ్రీధర్, మూగ శ్రీనివాస్‌ను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీచేశారు.