
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖిలా వరంగల్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రై వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ పడమరకోట ఎస్సీ కాలనీకి చెందిన ఆకులపల్లి కమలాకర్ (40) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పు తీర్చాలని మైక్రో ఫైనాన్స్‌లో వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో కమలాక ర్ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్స్‌కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి మమత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.