బొడ్డెమ్మ వేడుకలు షురూ | - | Sakshi
Sakshi News home page

బొడ్డెమ్మ వేడుకలు షురూ

Sep 13 2025 2:30 AM | Updated on Sep 13 2025 2:30 AM

బొడ్డ

బొడ్డెమ్మ వేడుకలు షురూ

27 మంది వార్డు ఆఫీసర్ల రిలీవ్‌

కాజీపేట/హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు పుట్టమట్టితో బొడ్డెమ్మలను తయారుచేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. సాయంత్రం సమయంలో ఉత్సాహంగా పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు.

చెల్పూరులో చైన్‌ స్నాచింగ్‌

బంగారు పుస్తెలతాడు అపహరణ

గణపురం: మండలంలోని చెల్పూరులో గురువారం అర్ధరాత్రి చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. చెల్పూరుకు చెందిన వృద్ధురాలు కౌటం మొండక్క మూత్రవిసర్జనకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడకు వెంట తెచ్చుకున్న టైరును వేసి బంధించాడు. ఒక చేతితో నోటిని మూసి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఆమె అరుపులు విన్న భర్త మొగిలయ్య బయటకు రావడంతో అప్పటికే దుండగుడు పారిపోయాడు. మెడ ను ంచి పుస్తెల తాడు తెంపే క్రమంలో మొండక్క మెడకు గాయాలయ్యాయి. భర్త మొగిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌ పేర్కొన్నారు.

వరుస చోరీలతో ఆందోళన..

గతనెలలో కూడా చెల్పూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు నరహరి కమలమ్మను ఇంటి వద్ద దింపుతానని గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలును లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగి నెలగడవక ముందే గురువారం అర్ధరాత్రి చైన్‌ స్నాచింగ్‌ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలను ప్పాడుతున్న వారు స్థానికుల లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని పోలీసులు ధైర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వరంగల్‌ అర్బన్‌: బల్దియా వార్డు ఆఫీసర్లుగా రెండేళ్ల క్రితం విధుల్లో చేరిన 27 మంది జీపీఏలు శుక్రవారం రిలీవ్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరిని తమ సొంత శాఖకు కేటాయించారు. అంతేకాకుండా ప్రభుత్వం వీరికి నియామకపత్రాలు అందజేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు.

ముగిసిన కబడ్డీ టోర్నమెంట్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఇంటర్‌ కాలేజీయేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఫైనల్‌లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించింది. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇరు జట్లకు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్‌ వై.వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ టి.మనోహర్‌ బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌. కుమారస్వామి, ఫిజికల్‌ డైరెక్టర్లు సోమన్న, జేత్య, కిరణ్‌కుమార్‌, పాషా, పల్లవి, బుచ్చన్న, సుమన్‌, అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బొడ్డెమ్మ వేడుకలు షురూ1
1/2

బొడ్డెమ్మ వేడుకలు షురూ

బొడ్డెమ్మ వేడుకలు షురూ2
2/2

బొడ్డెమ్మ వేడుకలు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement